దుర్గమ్మను ఐదు కోర్కెలు కోరా: సీఎం 

Cm chandrababu about his prayer to the god

సాక్షి, విజయవాడ: అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలు పోటీపడాలని, వారి కంటే ఎక్కువ రాణించాలని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ  కనకదుర్గమ్మను  చంద్రబాబు తన కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్లతో కలసి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  తాను దుర్గమ్మను దర్శించుకుని ఐదు కోర్కెలు కోరానని చెప్పారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్మార్ట్‌ వాటర్‌ గ్రిడ్, స్మార్ట్‌ పవర్‌ గ్రిడ్, పోలవరం సకాలంలో పూర్తిచేయడం, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపచేసేలా అమరావతి నిర్మాణం ఆ కోర్కెలని తెలిపారు.  

Back to Top