లారీ కిందపడి బాలుడి మృతి | child dies in lorry accident | Sakshi
Sakshi News home page

లారీ కిందపడి బాలుడి మృతి

Apr 6 2015 1:05 PM | Updated on Apr 3 2019 8:07 PM

బైక్‌పై వేగంగా వెళ్తున్న బాలుడు అదుపుతప్పి లారీ వెనుక టైరు కిందపడి మృతి చెందాడు.

కర్నూలు జిల్లా: బైక్‌పై వేగంగా వెళ్తున్న బాలుడు అదుపుతప్పి లారీ వెనుక టైరు కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం కర్నూలు జిల్లా బేతంచర్ల మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్ సమీపంలో జరిగింది. వివరాలు.. బేతంచెర్ల మండలానికి చెందిన రఫీ(12) తన అక్క జైనాబీని పదోతరగతి పరీక్షా కేంద్రం నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లాడు.


ఈ క్రమంలో తిరిగి వస్తుండగా లారీని క్రాస్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పి లారీ వెనుక టైరు కింద పడింది. దీంతో రఫీ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, జైనాబీ స్వల్పగాయాలతో బయటపడింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(బేతంచర్ల)
 

Advertisement
 
Advertisement
Advertisement