విజృంభిస్తున్న చికున్ గున్యా | Chicken Guinea expanded | Sakshi
Sakshi News home page

విజృంభిస్తున్న చికున్ గున్యా

Nov 9 2013 4:11 AM | Updated on Sep 2 2017 12:25 AM

మండలంలోని బ్రహ్మాజీవాడి గ్రామంలో 20 మందికిపైగా చికున్ గున్యా సోకడంతో బాధితులు మం చం పట్టారు.

తాడ్వాయి, న్యూస్‌లైన్: మండలంలోని బ్రహ్మాజీవాడి గ్రామంలో 20 మందికిపైగా చికున్ గున్యా సోకడంతో బాధితులు మం చం పట్టారు. వైద్యసిబ్బంది మాత్రం ఆ గ్రామంలోకి వెళ్లి రోగులను చూడకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థ ప డుతున్నారు. 20 రోజుల క్రితం గ్రామానికి చెందిన కొం తమందికి చికున్ గున్యా సోకడంతో మోకాళ్లలో నొప్పు లు ప్రారంభమై నడవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితులు చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని పలు ప్రైవే టు ఆస్పత్రులకు వెళ్లారు. అక్కడి వైద్యులు మందులను, ఇంజక్షన్లను ఇచ్చి పంపించారు. వైద్యులు మందులు ఇ చ్చినా ఫలితంలేదని, చికున్ గున్యాతో తీవ్ర ఇబ్బంది ప డుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.
 
 గతంలో కొందరికి చికున్ గున్యా వచ్చిందని, వారికి నయం కాకపోగా మరో 20 మందికి చికున్ గున్యా బారిన పడ్డారని పేర్కొన్నారు. బాధితుల్లో గ్రామానికి చెందిన గాజె న ర్సింలు, గాజె మమత, నగేష్, కుర్రాల రాజవ్వ, కన్క వ్వ, కళావతి, బాల్‌లక్ష్మితోపాటు మరికొందరు ఉన్నా రు. గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకుల వద్ద, డ్రైనేజీ ల వద్ద, మురుగు, చెత్త చెదారం చేరడంతోనే వ్యాధి సో కిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ పంచాయతీ సి బ్బంది, పాలకవర్గం నిర్లక్ష్యంతోనే పారిశుధ్యం లోపించి వ్యాధులు ప్రబులుతున్నాయని వివరించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చొరవ చూపి బ్రహ్మాజీవాడి లో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్య చికిత్సలు అందజేయాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement