చిత్తూరు: అద్వితీయ విజయం

Chevireddy Great Successes In Chandragiri - Sakshi

40,084 ఓట్ల రికార్డు మెజార్టీ 

చిత్తుగా ఓడిన పులివర్తి నాని

పోస్టల్‌ బ్యాలెట్‌తో ఉద్యోగుల అభిమానం 

రీ–పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ ఓటు బ్యాంక్‌కు భారీగా గండి

తిరుపతి రూరల్‌: నిత్యం అందుబాటులో ఉండే నాయకుడికి ఆదరణ, అభిమానం మెండుగా ఉంటాయని నిరూపించారు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు. అధికార కక్షసాధింపులు, అణచివేత కోసం బనాయించిన అక్రమ కేసులు, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి పార్టీ క్యాడర్‌ను చిన్నాభిన్నం చేయాలనే ప్రయత్నాలు, ప్రలోభాల పర్వాలు ఇలా ఒకటేమిటి రాజకీయంగా చెవిరెడ్డిపై ఎన్నోన్నో కక్షసాధింపు చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడింది.

ప్రజాభిమానమే అండగా వాటన్నీంటికి ఎదురెళ్లి, వాటిపై పోరాడి, విజయం సాధించిన వ్యక్తిగా నియోజకవర్గ ప్రజల హృదయాల్లో ధీరుడుగా నిలిచిపోయాడు. అందుకే చెవిరెడ్డికి అండగా నిలిచారు. ఓట్లతో తమ అభిమానిన్ని చాటుకున్నారు. ఎంతగా అంటే చంద్రగిరి నియోజకవర్గం ఏర్పడిన  తర్వాత ఎవరికి ఇవ్వనంతగా 40,084 ఓట్ల మెజారిటీతో గెలిపిం చారు.

జిల్లాలోనే అత్యధిక ఓట్లు చెవిరెడ్డికే 
జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థికి రానంతగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 1,25,005 ఓట్లను సాధించారు. ఇది జిల్లాలోనే అత్యధికం. సీఎం చంద్రబాబు కూడా 1,00,146 ఓట్ల వద్దే ఆగిపోయారు. చెవిరెడ్డి ప్రత్యర్థి పులివర్తి నానికి 84,921 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రికార్డు స్థాయిలో 40,084 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. 

అన్ని మండలాల్లోనూ మెజారిటీ
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, పాకాల మండలాల్లోనూ ప్రతిరౌండ్‌కు సంపూర్ణ ఆ«ధిక్యత సాధిస్తూ వచ్చారు. 325 పోలింగ్‌ కేంద్రాలతో పాటు సర్వీస్‌ ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్లలోనూ చెవిరెడ్డి హవానే కొనసాగింది. ఎర్రావారిపాళెం మండలంలో 1,900కు పైగా మెజారిటీ వచ్చింది.

చిన్నగొట్టిగల్లు మండలంలో 3,500కు పైగా వచ్చింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సొంత మండలం పాకాలలోనూ 4,000కు పైగా సాధిం చి చెవిరెడ్డి సత్తా చాటారు. సీఎం చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలో ఐదు వేలకుపైగా సాధించిన ఓట్లతో చెవిరెడ్డి విజయదుందుభి మోగించారు. రామచంద్రాపురం మండలంలో నూ గతంలో ఎన్నడూ లేనివిధంగా 3,500కు పైగానే మెజార్టీ సాధించారు. 

అనితర సాధ్యం.. ఆ మెజార్టీ
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సొంత మండలం తిరుపతి రూరల్‌లో చెవిరెడ్డికి ఎదురులేకుండా పోయింది. తిరుచానూరులో 3,800కు పైగా, శెట్టిపల్లిలో 2,700, దుర్గసముద్రం, మల్లంగుంట, అవిలాలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో చెవిరెడ్డి హవా నడిచింది. మండలంలో దాదాపు 20 వేలకు పైగానే మెజారిటీ సాధించారు. పోస్టల్‌ బ్యాలెట్, సర్వీస్‌ ఓట్లలో కూడా మెజారిటీ సాధించారు. 

రీ–పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీకి గండి
అక్రమాలు సాగించారంటూ చెవిరెడ్డి ఫిర్యాదులో నేపథ్యంలో రీపోలింగ్‌ నిర్వహించిన ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో కూడా వైఎస్‌ఆర్‌ సీపీకి ఆధిక్యత లభిం చింది. దీంతో దళితులు, గిరిజనులు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ కేంద్రాల్లో 884 ఓట్లు వైఎస్సార్‌ సీపీకి లభించాయి. దీంతో టీడీపీకి ఓటు బ్యాంక్‌గా ఉన్న ఆ గ్రామాల్లో ఎట్టకేలకు  గండి పడింది.

చంద్రగిరి: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రెండోసారి మళ్లీ ఎమ్మెల్యేగావిజయం సాధించారు. దీంతో పార్టీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. చంద్రగిరి టవర్‌క్లాక్‌ వద్ద పార్టీ నాయకులు  బాణ సంచా పేల్చి సంబరాలు జరుపుకుకున్నారు.  

చంద్రగిరి రూరల్‌ (తిరుచానూరు) : తిరుచానూరులో విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి రూరల్‌ మండల తూర్పు అద్యక్షుడు రామచంద్రారెడ్డి, సీనియర్‌ నేత సీఆర్‌. రాజన్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య భారీకేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. 

పాకాల: పాకాలకు గురువారం సాయంత్రం 7.30 గంటలకు వచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి  ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. 

రామచంద్రాపురం: మండలంలోని సీకాపల్లె పంచా యతీ సూరావారిపల్లె ప్రజలు కృష్ణుడి ఆల యం వద్ద 1,032 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు.  మండల కన్వీనర్‌ బ్రంహ్మానందరెడ్డి, కేశవులురెడ్డి, మొగిలిరెడ్డి, విజయరెడ్డి, చంద్రారెడ్డి, బీకిరెడ్డి, రామిరెడ్డి, జయరామిరెడ్డి, చెంగల్రాయరెడ్డి, షణ్ముగంరెడ్డి, పాల్గొన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top