
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి చంద్రన్న క్రిస్మస్ కానుకలను ఉచితంగా పంపిణీ చేయను న్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అలాగే, జనవరి 1వ తేదీ నుంచి చంద్రన్న సంక్రాంతి కానుకలు అందిస్తామన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరిలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో కొత్త రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఉన్న కోటీ 43లక్షల 30వేల కార్డుదారులకు రూ.360కోట్లతో చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలను అందిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు చంద్రన్న క్రిస్మస్ కానుకలు, జనవరి 1 నుంచి ఇతర రేషన్ సరుకులతో కలిపి చంద్రన్న సంక్రాంతి కానుకలను అందిస్తామని మంత్రి తెలిపారు.