మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం! | chandrababu naidu Unsatisfied with ministers! | Sakshi
Sakshi News home page

మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం!

Feb 2 2015 7:51 PM | Updated on Jul 23 2018 7:01 PM

మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం! - Sakshi

మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...మంత్రుల తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...మంత్రుల తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆయన మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్వైన్ఫ్లూ విజృంభిస్తున్నా మంత్రులు పట్టించుకోవటం లేదని చంద్రబాబు ఆగ్రహించినట్లు సమాచారం.

'మీలో ఎవరైనా జిల్లాల్లో రివ్యూలు చేశారా? అని ఆయన ప్రశ్నించారని, శాఖాపరమైన సమీక్షలు కూడా చేయడం లేదని, తాను చెప్పినా అమలు చేయటం లేదని, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం లేదని ప్రజలు అనుకుంటున్నారని' చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది. మంత్రులు జిల్లాల్లో ఉంటే..ప్రజలకు నమ్మకం కలుగుతుందని, సొంతపనుల కోసం మంత్రులంతా హైదరాబాద్లో ఉండిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement