ప్రజాపోరాటం
ఓటుకు నోటు కుంభకోణంలో సీఎం చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది...
- చంద్రబాబును అరెస్టు చేయాలని డిమాండ్
- సీఎం పదవికి రాజీనామా చేయాలి...
- లేకపోతే గవర్నర్ బర్తరఫ్ చేయాలి
- నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్యమపథం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఓటుకు నోటు కుంభకోణంలో సీఎం చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆయన పదవికి రాజీనామా చేయాలని నినదించింది. తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడి ప్రజాస్వామ్య విలువలను దిగజార్చారంటూ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టింది. పాడేరు, విశాఖపట్నంలలో పార్టీ నేతలు సోమవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వీరు భారీస్థాయిలో ఆందోళనలు నిర్వహించేందుకు సంసిద్ధమవుతున్నారు. సీఎం చంద్రబాబును అరెస్టు చేయాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిడిమాండ్ చేశారు. పాడేరులో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సోమవారం భారీ ధర్నా నిర్వహించారు.
చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకువచ్చి దహ నం చేశారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వ రి మాట్లాడుతూ చంద్రబాబు ఇంకా పదవిని పట్టుకువేళ్లాడుతుండటం దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారని వీడియో, ఆడియో ఆధారాలతోస హ సహా నిరూపితమయ్యాయని ఆమె అన్నారు. వెంటనే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకుని విచారించాలన్నారు.కార్యక్రమంలో పాడేరు, అరకు ఎంపీపీలు ముత్యాల మ్మ, అరుణకుమారి పాల్గొన్నారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ దక్షిణి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా చంద్రబాబును చేర్చాలని కోరారు. చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకువచ్చి జగదాంబ జంక్షన్‌లో దహనం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పాల్గొన్నారు.