Vote To Note Scam
-
‘కేసీఆర్ మీటింగ్.. చంద్రబాబుకు షేకింగ్’
సాక్షి, విజయవాడ: ఓటుకు నోటు కేసు దర్యాప్తు ముమ్మరం అవుతుంది కాబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ మీటింగ్ పెడితే ఇక్కడ చంద్రబాబుకు వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఓటుకు నోట్లు ఇచ్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబును శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ‘బ్రీఫ్డ్’ అన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్థారించిందని, ఈ ఆధారాలు బట్టి బాబును అరెస్ట్ చేయాలని కోరారు. ‘పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలను చంద్రబాబు కులదోసేస్తాం అంటే ఉరుకుంటారా? ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన పాపాలు పండేరోజు దగ్గరలోనే ఉంది. బీజేపీతో లాలుచి పడింది చంద్రబాబే. బ్రీఫ్డ్ మీ అంత బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడేవారు ఈ ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరొకరు ఉండరని కేటీఆర్ అప్పుడే చెప్పార’ని ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందంటూ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వంలో ఆడవాళ్లపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయని ఆరోపించారు. నేరాలను అరికట్టాల్సిన చంద్రబాబు తన ఎమ్మెల్సీల చేత మహిళ ఎమ్మెల్యేనని చూడకుండా తనపై దిగజారుడు మాటలు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మహిళ వ్యతిరేకి అని ఆరోపించారు. ‘దాచేపల్లి ఘటనలో నేను వెళ్లిన తర్వాత చంద్రబాబు స్పందించి బాధితురాలికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతిపక్షంగా మేము స్పందిస్తేగానీ మీరు పట్టించుకోరా’ అని ప్రశ్నించారు. చంద్రబాబు తన అధికారాన్ని, డబ్బును పెట్టి దొంగ రాజకీయాలు చేస్తూ తిరిగి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు దొంగదీక్షలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మప్రసక్తే లేదని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. -
ప్రజాపోరాటం
- చంద్రబాబును అరెస్టు చేయాలని డిమాండ్ - సీఎం పదవికి రాజీనామా చేయాలి... - లేకపోతే గవర్నర్ బర్తరఫ్ చేయాలి - నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్యమపథం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఓటుకు నోటు కుంభకోణంలో సీఎం చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆయన పదవికి రాజీనామా చేయాలని నినదించింది. తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడి ప్రజాస్వామ్య విలువలను దిగజార్చారంటూ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టింది. పాడేరు, విశాఖపట్నంలలో పార్టీ నేతలు సోమవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వీరు భారీస్థాయిలో ఆందోళనలు నిర్వహించేందుకు సంసిద్ధమవుతున్నారు. సీఎం చంద్రబాబును అరెస్టు చేయాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిడిమాండ్ చేశారు. పాడేరులో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకువచ్చి దహ నం చేశారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వ రి మాట్లాడుతూ చంద్రబాబు ఇంకా పదవిని పట్టుకువేళ్లాడుతుండటం దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారని వీడియో, ఆడియో ఆధారాలతోస హ సహా నిరూపితమయ్యాయని ఆమె అన్నారు. వెంటనే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకుని విచారించాలన్నారు.కార్యక్రమంలో పాడేరు, అరకు ఎంపీపీలు ముత్యాల మ్మ, అరుణకుమారి పాల్గొన్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ దక్షిణి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా చంద్రబాబును చేర్చాలని కోరారు. చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకువచ్చి జగదాంబ జంక్షన్లో దహనం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పాల్గొన్నారు.