అగ్రిగోల్డ్‌ బాధితునికి సీఎం చెంపదెబ్బ

Chandrababu beats Agrigold victims - Sakshi

న్యాయం చేయాలని కోరిన వ్యక్తిపై ఆగ్రహం 

అనంతపురం/అనంతపురం అర్బన్‌: పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ పోగొట్టుకుని, ఇప్పటికే తీరని దుఃఖంలో ఉన్న అగ్రిగోల్డ్‌ బాధితుల పట్ల సీఎం చంద్రబాబు దౌర్జన్యంగా వ్యవహరించారు. తమ గోడు చెప్పుకునేందుకు వచ్చిన ఓ బాధితుడిపై చేయి చేసుకున్నారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. అనం తపురంలో పర్యటిస్తున్న సీఎం జిల్లా కేంద్రం లోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బస చేశారు. శనివారం ఉదయం ఆయనను కలిసేందుకు అగ్రిగోల్డ్‌ బాధితులు వచ్చారు. బాబు బయటకు వస్తున్నప్పుడు బాధితులంతా వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించారు. ‘‘సార్‌! మేం అగ్రిగోల్డ్‌ బాధితులం.

మాకు న్యాయం జరిగేలా చూడండి’’ అని అగ్రిగోల్డ్‌ బాధితుల ప్రతినిధి సిద్ధేశ్వర్‌ కోరాడు. ‘‘న్యాయం చేస్తున్నాం కదా’’ అని చంద్రబాబు బదులిచ్చారు. ‘‘నాలుగేళ్లుగా తిరుగుతున్నాం. న్యాయం చేస్తున్నామం టున్నారు. బాధితులెవరికీ ఇప్పటిదాకా నయాౖ పెసా రాలేదు’’ అని సిద్ధేశ్వర్‌  చెప్పబోయాడు.  సీఎం స్పందిస్తూ.. ‘‘ఏయ్‌ వినయ్యా.. కోర్టులో ఉంది కదా’’ అని అన్నారు. ‘‘మన రాష్ట్రంలోనే 20 లక్షల మంది బాధితులు ఉన్నారు సార్‌’’ అంటూ సిద్ధేశ్వర్‌ తిరిగి బదులివ్వగా చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘ఏయ్‌ వినయ్యా’’ అంటూ సిద్ధేశ్వర్‌ చెంప చెల్లుమనిపించారు. ‘‘వేరే రాష్ట్రంలో ఎవరైనా పట్టించుకున్నారా? వాళ్లు(అగ్రిగోల్డ్‌ నిందితులు) పారిపోకుండా చూస్తున్నాం. న్యాయం చేస్తాం’’ అని సీఎం అన్నారు. ‘‘రాజ్యాంగం ఉండేది కూడా ప్రజల కోసమే కదా సార్‌. ఈ వారంలోనే ఐదుగురు బాధితులు చనిపోయారు’’ అంటూ సిద్ధేశ్వర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. సరేనయ్యా న్యాయం చేస్తామంటూ సీఎం అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. 

కాతగాప్రభుత్వ పథకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని, అధికారులను బాబు ఆదేశించారు. సీఎం  శనివారం అనంతపురంలో అధికారులతో సమీక్షించారు. ఇందుకు పలు సూచనలు చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top