'సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి' | chandra babu should resign cm post, says pallam raju | Sakshi
Sakshi News home page

'సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి'

Jun 15 2015 3:10 PM | Updated on Mar 28 2019 5:27 PM

'సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి' - Sakshi

'సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు డిమాండ్ చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు తెరపైకి వచ్చిన నేపథ్యంలో పల్లంరాజు స్పందించారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్తో చంద్రబాబు ఫోన్లో  మాట్లాడినట్టు రికార్డయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు పాత్రను పల్లంరాజు తప్పుపడుతూ సీఎం పదవికి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. ఇక ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీకి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహాయం చేయడం సరికాదని పల్లంరాజు అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement