కళింగపట్నం బీచ్‌లో విషాదం,చివరి సెల్ఫీ | Chaitanya College Students Missing in Kalingapatnam Beach | Sakshi
Sakshi News home page

సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతు

Nov 10 2019 6:41 PM | Updated on Nov 10 2019 7:51 PM

స్నేహితులు కలిసి దిగిన చివరి సెల్ఫీ, వృత్తంలో గల్లంతు అయినవారు..  - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానం సరదా కాస్తా వారి ప్రాణాల మీదకు తెచ్చింది. సముద్ర స్నానానికి వెళ్లిన అయిదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం విద్యార్థులు.  

మృతులు షేక్‌ అబ్దుల్లా, ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, యజ్ఞమయ పండా, కురుమూరి సందీప్‌, అనపర్తి సుందర్‌గా గుర్తించారు. కాగా ఆదివారం సెలవు కావడంతో మొత్తం ఆరుగురు విద్యార్థులు కళింగపట్నం బీచ్‌కు వచ్చారు. అనంతరం స్నానానికి దిగారు. సరదాగా స్నేహితులంతా అప్పటివరకూ సెల్ఫీలు దిగారు. ఇంతలో పెద్ద అల రావడంతో గల్లంతు అయ్యారు. ఈ ఆరుగురిలో లింగాల రాజసింహం అనే విద్యార్థిని మెరైన్‌ సిబ్బంది రక్షించారు. మరోవైపు గల్లంతు అయిన విద్యార్థులు కుటుంబాలు ...తమ పిల్లల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి.

గల్లంతు అయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement