సమైక్యవాదులు వెధవలు: కావూరి | Central minister Kavuri sambasivarao attacked by egg-throwing protestors due to state bifurcation | Sakshi
Sakshi News home page

సమైక్యవాదులు వెధవలు: కావూరి

Dec 17 2013 1:02 PM | Updated on Jul 11 2019 5:40 PM

సమైక్యవాదులు వెధవలు: కావూరి - Sakshi

సమైక్యవాదులు వెధవలు: కావూరి

సమైక్యవాదులు వట్టి వెధవలు, చేతకానివారంటూ కేంద్ర జౌళి శాఖ మంత్రి, ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివరావు తన నోటి దురుసును మరోసారి ప్రదర్శించారు.

సమైక్యవాదులు వట్టి వెధవలు, చేతకానివారంటూ కేంద్ర జౌళి శాఖ మంత్రి, ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివరావు తన నోటి దురుసును మరోసారి ప్రదర్శించారు. అధికార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి విచ్చేశారు. ఈ సందర్బంగా  కావూరి పర్యటనను సమైక్యవాదులు అడ్డుకుని... ఆయన వాహనంపై కోడిగుడ్లతో దాడి చేసి... వ్యతిరేకంగా  పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

 

కావూరి మంత్రి పదవికి రాజీనామా చేయకుండా, తాత్సరం చేయడం వల్లే కేంద్రం విభజన విషయంలో ముందుకు వెళ్తుందని సమైక్యవాదులు ఆరోపించారు. దాంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన కావూరి ... సమైక్యవాదులపై ఇష్టం వచ్చినట్లు తిట్ల దండకం అందుకున్నారు.  సమైక్యవాదులు వెధవలు, చేతకానివారంటూ వ్యాఖ్యలు చేశారు.

 

ఇంతలో రంగప్రవేశం చేసిన పోలీసులు  సమైక్యవాదులపై లాఠీచార్జీ చేశారు. దీంతో పోలీసులు, సమైక్యవాదుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.  ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్తో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆయనను లాఠీలతో కొట్టి బట్టలు చించేవారు. అనంతరం మద్దాల రాజేష్ సహా  20 మంది సమైక్యవాదులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement