ఇక నగదు లేకున్నా ఆర్టీసీ బస్సులో ప్రయాణం!

Cashless Travel In APSRTC Bus Pilot Project Launched At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణానికి కీలక ముందడుగు పడింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణానికి పైలెట్‌ ప్రాజెక్టును ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు విజయవాడలో బుధవారం ప్రారంభించారు. దానిలో భాగంగా ఆర్టీసీ వైఎస్‌ చైర్మన్‌, ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ ఛలో మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. 2.5 లక్షల ప్రయాణికులకు ఛలో యాప్‌ ఉపయోగకరంగా మారనుంది. యాప్‌తో పాటు స్మార్ట్‌ కార్డులను కూడా ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. టిమ్‌ మిషన్‌ ద్వారా స్మార్ట్‌ కార్డులను ఉపయోగించకోవచ్చని ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌ తెలిపారు.

ప్రయోజనాలివి..
చిల్లర సమస్య ఎదురుకాదు.
ఆర్టీసీ సిబ్బందికి సమయం ఆదా అవుతుంది.
నగదు లేకపోయినా కార్డు ద్వారా ప్రయాణం చేయొచ్చు.
ప్రతిరోజు ప్రయాణం చేసే ఉద్యోగులకు, వ్యాపారులకు ఉపయుక్తంగా ఉటుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top