శంకర్ పౌండేషన్ ఎండీ మణిమాలపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
విశాఖపట్నం: శంకర్ పౌండేషన్ ఎండీ మణిమాలపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తప్పుడు ధృవపత్రాలతో సంస్థ నిధులను దుర్వినియోగం చేస్తోందంటూ ఆమెపై శంకర్ పౌండేషన్ వ్యవస్థాపకుని భార్య యశోద ఫిర్యాదు చేసింది. యశోద ఫిర్యాదు మేరకు ఎండీ మణిమాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.