breaking news
Manimala
-
ఒక్కటైన ప్రేమజంట
తనకల్లు (కదిరి) : అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోటకు చెందిన మణిమాల, కర్నూలు జిల్లా నంద్యాల మండలం ఎర్రగుంట్లకు చెందిన ప్రసన్నకుమార్ ప్రేమకథ సుఖాంతమైంది. వీరిద్దరూ కలసి ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాలుగేళ్ల కిందట ఇంజినీరింగ్ చదివేవారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. చదువు పూర్తయ్యాక తమ ప్రేమ విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలిపారు. పెళ్లి చేసి ఆశీర్వదించాలని కోరారు. కులాలు వేరైనా అబ్బాయి తరఫు వారు సుముఖత చూపగా, అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. ఇద్దరూ మేజర్లు కావడంతో తనకల్లు మండలం తవళం ఆంజనేయస్వామి దేవస్థానంలో వారిద్దరూ దండలు మార్చుకొని బుధవారం ఒక్కటయ్యారు. వధూవరులను ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రమణ, ఇతర పెద్ద మనుషులు ఆశీర్వదించారు. -
శంకర్ పౌండేషన్ ఎండీపై కేసు నమోదు
విశాఖపట్నం: శంకర్ పౌండేషన్ ఎండీ మణిమాలపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తప్పుడు ధృవపత్రాలతో సంస్థ నిధులను దుర్వినియోగం చేస్తోందంటూ ఆమెపై శంకర్ పౌండేషన్ వ్యవస్థాపకుని భార్య యశోద ఫిర్యాదు చేసింది. యశోద ఫిర్యాదు మేరకు ఎండీ మణిమాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.