విశాఖ జిల్లా అనకాపల్లిలో వరదనీటిలో ఓ కారు చిక్కుకుపోయింది.
విశాఖపట్నం: విశాఖ జిల్లా అనకాపల్లి వద్ద వరదనీటిలో ఓ కారు చిక్కుకుపోయింది. నీటిలో కొట్టుకొచ్చి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. బాధితులు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. వీరిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హుదూద్ తుఫాన్ అనకాపల్లిలో విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలులు బలంగా వీయడంతో అనకాపల్లి నుంచి విశాఖపట్నం జాతీయ రహదారిపై చెట్లు కూలిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.