ప్రేమ విఫలమై సీఏ విద్యార్థి ఆత్మహత్య | CA student Commits Suicide after Love failure | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై సీఏ విద్యార్థి ఆత్మహత్య

Oct 22 2013 12:47 PM | Updated on Nov 9 2018 4:36 PM

ఆర్థిక ఇబ్బందులతో పాటు, ప్రేమించిన అమ్మాయి మోసం చేయటంతో మనస్తాపం చెందిన ఓ సీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆదిలాబాద్ : ఆర్థిక ఇబ్బందులతో పాటు, ప్రేమించిన అమ్మాయి మోసం చేయటంతో మనస్తాపం చెందిన ఓ సీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ భుక్తాపూర్ కాలనీకి చెందిన అక్షయ్ (22) విజయవాడలోని ఓ ప్రయివేట్ కళాశాలలో సీఐ చదువుతున్నాడు. దసరా సెలవులు కారణంగా ఇంటికి వచ్చాడు. సోమవారం రాత్రి అతను గదిలోని ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని...ఓ సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో సుమారు రూ.70వేల అప్పు చేయటంతో పాటు, ప్రేమించిన అమ్మాయి మోసం చేయటంతో తట్టుకోలేక అక్షయ్  ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్ టౌన్ ఎస్ఐ స్వామి తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాగా చేతికి అంది వచ్చిన కొడుకు అకాల మరణంతో కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement