చంద్రబాబు సీఎం, టీడీపీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేయాలని సి రామచంద్రయ్య డిమాండ్ చేశారు.
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కుట్రదారనడానికి సాక్షాధారాలున్నాయని కాంగ్రెస్ నేత, మండలిలో విపక్ష నాయకుడు సి రామచంద్రయ్య అన్నారు. ఈ కేసు విచారణ నిష్పక్షిపాతంగా జరగాలంటే చంద్రబాబు సీఎం, టీడీపీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేయాలని సి రామచంద్రయ్య డిమాండ్ చేశారు.
అవినీతికి వ్యతిరేకమని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రబాబు అవినీతి ప్రభుత్వాన్నికి మద్దతు కొనసాగిస్తారో లేదో చెప్పాలని సి.రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు మౌనంగా ఉండటమే ఆయన తప్పు చేశారనడానికి నిదర్శమని చెప్పారు. చంద్రబాబు చేపట్టింది నవనిర్మాణ దీక్ష కాదు నయవంచన దీక్షని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలకు కారణం ఏంటో చెప్పాలని అన్నారు. అవినీతి, రాజకీయ కుట్రతో రాష్ట్ర విభజన చేయించడం చంద్రబాబు దివాలాకోరు రాజకీయమని సి. రామచంద్రయ్య ధ్వజమెత్తారు.