అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంఘటన ఇది. ఆర్‌బీ కొత్తూరు గ్రామానికి చెందిన బయ్యా శ్రీను
పెద్దాపురం : అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంఘటన ఇది. ఆర్‌బీ కొత్తూరు గ్రామానికి చెందిన బయ్యా శ్రీను(27), బయ్యా శివ(22) వ్యవసాయ కూలీలు. ఏడాదిన్నర క్రితం శ్రీనుకు వివాహమైంది. అతడికి భార్య, ఆరు నెలల కుమార్తె ఉన్నారు. కాగా సోమవారం శ్రీను, శివ కలిసి రాజమండ్రిలో బైక్ ఫైనాన్‌స వాయిదా చెల్లించేందుకు వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటాక ఆర్‌బీ కొత్తూరు సమీపానికి వచ్చేసరికి మోటార్ బైక్ అదుపుతప్పింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీను, శివ అక్కడికక్కడే చనిపోయారు. కాగా పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే వారి బంధువులు.. మృతదేహాలను తరలించారు. దీనిపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై వై.సతీష్ తెలిపారు.