ఓ వ్యక్తి తన సోదరిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడన్‌హళ్లి గ్రామంలో జరిగింది.
అనంతపురం: ఓ వ్యక్తి తన సోదరిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడన్‌హళ్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగరాజు అనే యువకుడు తన సోదరి వడ్డె గోవిందమ్మ(40)పై శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో దాడి చేశాడు. ఛాతిపై కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నాగరాజును నిలువరించేందుకు ప్రయత్నించిన గోవిందమ్మ అల్లుడు వెంకటేష్‌కు కూడా గాయాలయ్యాయి. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని వారు తెలిపారు.
(మడకశిర)