కొద్ది గంటల్లోనే పెళ్లి... వరుడు ఆత్మహత్య | bridegroom takes committed suicide in guntur district | Sakshi
Sakshi News home page

కొద్ది గంటల్లోనే పెళ్లి... వరుడు ఆత్మహత్య

Feb 8 2015 12:23 PM | Updated on Nov 6 2018 7:56 PM

మరికొద్ది గంటల్లో శుభకార్యం జరగనున్న పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది.

గుంటూరు: మరికొద్ది గంటల్లో శుభకార్యం జరగనున్న పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. కోరుకున్నట్లుగా కాకుండా సాధారణ రీతిలో వివాహం జరిపిస్తున్నారని మనస్తాపానికి గురైన పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

స్నేహితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... పెళ్లి కుమారుడు ఏసుబాబు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములాయపాడు గ్రామానికి చెందినవాడు. తన అక్క కూతురితో ఏసుబాబుకు వివాహాన్ని నిశ్చయించారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఏసుబాబు తన మేనకోడలిని వివాహం చేసుకోవాల్సి ఉండగా... పెళ్లి ఏర్పాట్లు సాధారణంగా ఉండటంతో తీవ్ర మనస్తాపనానికి గురయ్యాడు. ఏసుబాబు కోరుకున్నట్లుగా వైభవంగా కాకుండా సాధరణ రీతిలో వివాహ ఏర్పాట్లు ఉన్నాయని ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకు మించి పెద్ద కారణాలేవి కనిపించటం లేదని పెళ్లి కుమారుడి స్నేహితులు తెలిపారు. ఏసుబాబు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ రెండు కుటుంబాలు కన్నీరుమన్నీరయ్యాయి. మరికొద్ది గంటల్లో శుభకార్యం ఉండగా ఈ విషాదం చోటుచేసుకోవడంతో రెండు కుటుంబాలతో పాటు బంధువులు ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement