నీటిగుంటలో పడి బాలుడు మృతి | boy dies after fall down in sump in kurnool district | Sakshi
Sakshi News home page

నీటిగుంటలో పడి బాలుడు మృతి

Aug 30 2015 3:42 PM | Updated on Jul 12 2019 3:02 PM

ఆస్పరి మండలంలోని చాకిరేవు నీటిగుంటలో పడి ప్రమాదవశాత్తూ భరత్(16) అనే బాలుడు మృతిచెందాడు.

కర్నూలు: ఆస్పరి మండలంలోని చాకిరేవు నీటిగుంటలో పడి ప్రమాదవశాత్తూ భరత్(16) అనే బాలుడు మృతిచెందాడు. ఆదివారం సెలవు కావడంతో భరత్ తోటి స్నేహితులతో కలిసి సరదాగా నీటిగుంటకు చేరుకున్నాడు. అందులోకి దిగిన భరత్ లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు.

భరత్ మృతదేహాన్ని వెలికి తీయటానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement