
విజయనగరంలో 144 సెక్షన్ ఎత్తివేయాలి: బొత్స
విజయనగరం పట్టణంలో అమలులో ఉన్న 144 సెక్షన్ ఎత్తివేయాలని అధికారులకు సూచించామని బొత్స సత్యనారాయణ తెలిపారు.
విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారికి ఏటా నిర్వహించే జాతర మహోత్సవంలో కీలకమైన తొలేళ్లు ఉత్సవం నేడు ప్రారంభమయింది. జాతరలో భాగంగా సంగీత కళాశాల ఆవరణలో వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పట్టణంలో అమలులో ఉన్న 144 సెక్షన్ ఎత్తివేయాలని అధికారులకు సూచించామని తెలిపారు. పట్టణంలో పక్షం రోజుల క్రితం జరిగిన అల్లర్ల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రస్తుతం 144 సెక్షన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవ సందడి తగ్గేఅవకాశాలున్నాయని భావిస్తున్నారు.