మృతదేహాల్లో 6 గంటల తర్వాత కరోనా వైరస్‌ ఉండదు

Bodies of those who died of corona did not have the virus 6 hours later - Sakshi

వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి

లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కేసుల సంఖ్య పెరిగింది

రాష్ట్రంలో ఇప్పటివరకు 9,71,611 మందికి కరోనా పరీక్షలు 

వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: కరోనా వ్యాధితో మరణించిన వారి మృతదేహాలలో 6 గంటల తర్వాత వైరస్‌ ఉండదని వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి వెల్లడించారు. వైరస్‌తో మృతి చెందిన వారి దహన సంస్కారాలను అడ్డుకుని ఇబ్బందులు కలుగజేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ఆర్‌ అండ్‌ బీ భవన ప్రాంగణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని కోరారు. జవహర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..

► మాస్కు ధరించడం, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం అనే మూడు సూత్రాలు పాటిస్తే కరోనా మన దరిచేరదు.

► రాష్ట్రంలో మార్చి 9న తొలి కరోనా కేసు నమోదైతే జూలై 3వ తేదీ నాటికి ఆ సంఖ్య 16,934కి చేరింది.

► రాష్ట్రంలో ఇప్పటివరకు 9,71,611 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. ప్రతి 10 లక్షల మందికి సగటున 18,195 పరీక్షలు చేశాం.

► పరీక్షలు నిర్వహించేందుకు మొదట్లో మనకు ఒక ల్యాబ్‌ కూడా ఉండేది కాదు. ప్రస్తుతం 15 ప్రభుత్వ, 4 ప్రైవేట్‌ కలిపి మొత్తం 19 ల్యాబ్‌లు పని చేస్తున్నాయి.

► పరీక్షా ఫలితాలు వేగంగా తెలుసుకునేందుకు ప్రభుత్వ ల్యాబ్‌లలో 47 ఆర్‌టీపీసీ యంత్రాలు ఉన్నాయి.

► కరోనా వైరస్‌తో 9,096 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో వ్యాధి తీవ్రత తక్కువ ఉన్న 600 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

► వెయ్యికి పైగా శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేసి ఎక్కువగా.. వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం.
► కరోనా వ్యాప్తికి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయం చేసేందుకు వివిధ కేటగిరీలుగా విభజించి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నాం.

► బయటి ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు, నిర్మాణ రంగం, వ్యవసాయ కూలీలు, కూరగాయలు విక్రయించేవారు, పరిశ్రమల్లోని కార్మికులు, మార్కెట్‌ యార్డులు, ఆరోగ్య తదితర రంగాల్లో పని చేసేవారికి ర్యాండమ్‌గా పరీక్షలు చేయిస్తున్నాం.

► పండ్లు, కూరగాయలు అమ్మేవారి ద్వారా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించాం. 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా మృతి చెందుతున్నారు.

► కరోనా వ్యాధి ముదిరిన తర్వాత చికిత్సకు ఎక్కువ మంది వస్తున్నారు. లక్షణాలు కన్పించిన వెంటనే దగ్గర్లోని డాక్టర్, పీహెచ్‌సీ, సీహెచ్‌సీలను లేదా ఆశా వర్కర్లు, వలంటీర్లను సంప్రదించాలి.

► ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెలీ మెడిసిన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి సూచనలు పొందాలి. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కేసుల సంఖ్య పెరిగింది.

► డాక్టర్లపై భారాన్ని తగ్గించేందుకు 22 వేల మంది డాక్టర్లు, 24 వేల మంది పారా మెడికల్‌ తదితర సిబ్బందిని పెద్దఎత్తున నియమిస్తున్నాం.

► కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులకు త్వరలోనే కోవిడ్‌ చికిత్సలకు అనుమతి ఇస్తాం. అక్కడ వసూలు చేసే చార్జీలపై కూడా నియంత్రణ ఉంటుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

12-08-2020
Aug 12, 2020, 11:32 IST
దాచేపల్లి : కరోనా మహమ్మారి అన్నదమ్ములను మింగేసింది. 20 రోజుల వ్యవధిలో కరోనాతో ఇద్దరూ మృత్యువాత పడిన విషాద ఘటన...
12-08-2020
Aug 12, 2020, 11:31 IST
వాషింగ్టన్ : కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అమెరికా మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనాకు కచ్చితమైన వ్యాక్సిన్ తమదేనని...
12-08-2020
Aug 12, 2020, 11:08 IST
ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అనే మాటను అక్షరాలా నిజం చేసుకుంటున్నారు ఈ తాతమ్మ, తాతయ్యలు. పాత దుస్తులను ధరించి మోడలింగ్‌ చేయడం...
12-08-2020
Aug 12, 2020, 10:57 IST
‘ఈ మహమ్మారి కాలంలో ప్రజలు వ్యాధి పట్ల అవగాహ కలిగి ఉండాలి. అప్పుడే వ్యాధి విస్తృతికి అడ్డుకట్ట వేయవచ్చు’ అని...
12-08-2020
Aug 12, 2020, 10:15 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కరోనా మహమ్మారి, ఆర్థికసంక్షోభంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో దేశ...
12-08-2020
Aug 12, 2020, 09:56 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్యలో రికార్డు స్థాయిలో...
12-08-2020
Aug 12, 2020, 09:10 IST
వ్యాక్సిన్‌ వేసుకున్న తరువాత కరోనా వస్తే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అనుమానం వ్యకం చేస్తున్నారు. ...
12-08-2020
Aug 12, 2020, 09:08 IST
సాక్షి, సిటీబ్యూరో: గతకొంత కాలంగా సిటీజన్లకుకంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్‌క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో గ్రేటర్‌వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు....
12-08-2020
Aug 12, 2020, 09:05 IST
సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలో  కొత్తగా 1897 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్‌...
12-08-2020
Aug 12, 2020, 08:40 IST
సాక్షి, సిటీబ్యూరో: ‘పెద్దల మాట..చద్దన్నం మూట’ అన్నారు. సామెత పాతదే కావచ్చు. కానీ ఇప్పుడుకోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఇది ఒక ఆయుధంలాపనిచేస్తుంది....
12-08-2020
Aug 12, 2020, 08:29 IST
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే సదరు ఘటనలు పునరావృతం కాకుండాతగు చర్యలు...
12-08-2020
Aug 12, 2020, 08:20 IST
న్యూఢిల్లీ : కోవిడ్‌–19 నిరోధక టీకాను దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం ఎలా అన్న అంశంపై బుధవారం నిపుణుల కమిటీ భేటీ...
12-08-2020
Aug 12, 2020, 07:50 IST
గాంధీఆస్పత్రి : కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిలో బయోమెడికల్‌ (జీవ) వ్యర్థాలు రోజురోజుకూ గుట్టలుగా పేరుకుపోతున్నాయి. డంపింగ్‌యార్టుకు తరలించి...
12-08-2020
Aug 12, 2020, 06:26 IST
జీడిమెట్ల/చాదర్‌ఘాట్‌/కమ్మర్‌పల్లి: కరోనా భయంతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కరోనాతో చిక్సిత పొందుతూ ఒకరు, కరోనా సోకిందేమోనన్న భయంతో మరొకరు, టీవీలో...
12-08-2020
Aug 12, 2020, 06:18 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 6,42,875 మందికి పరీక్షలు నిర్వహించగా.. 82,647...
12-08-2020
Aug 12, 2020, 04:49 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడి కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం...
12-08-2020
Aug 12, 2020, 03:56 IST
న్యూఢిల్లీ: కలసికట్టుగా కరోనాపై పోరాటం చేద్దామని ప్రధాని  మోదీ  ముఖ్యమంత్రులకు పిలుపు నిచ్చారు. కోవిడ్‌  కేసులు అత్యధికంగా ఉన్న 10...
12-08-2020
Aug 12, 2020, 03:50 IST
మాస్కో: కరోనా వైరస్‌ నిరోధానికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన తొలిదేశంగా రష్యా రికార్డు సృష్టించినట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌...
12-08-2020
Aug 12, 2020, 03:44 IST
న్యూయార్క్‌/మాస్కో: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌–19 విజృంభణ ఆగడం లేదు. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటేసింది. అమెరికా,...
12-08-2020
Aug 12, 2020, 00:47 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి వ్యాప్తితో ఎదురవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని దేశంలో వైద్య సదుపాయాలను పెంచే...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top