గోదావరిలో బోటు బోల్తా: 8మంది మృతి

Boat Accident in Godavari: Eight Bodies recovered - Sakshi

సాక్షి, రంపచోడవరం:  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో బోటు మునక దుర్ఘటనలో 8మంది మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదం నుంచి 27మంది సురక్షితంగా బయటపడగా, సుమారు 25మంది ఆచూకీ లభించాల్సి ఉందని తెలిపింది. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు ఆరు అగ్నిమాపక సిబ్బంది, నేవీ గజ ఈతగాళ్ల బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రెండు హెలికాఫ్టర్లు, 8 బోట్లు, ఆస్కా లైట్లు, ఇతర రెస్క్యూ పరికరాలతో రాత్రికి కూడా గాలింపు చర్యలు కొనసాగనున్నాయి. సోమవారం ఉత్తరాఖండ్‌ నుంచి ప్రత్యేక బృందాలు సైడ్‌ స్కాన్‌ సోనార్‌తో మృతదేహాల గాలింపులో పాల్గొంటాయని విపత్తుల నిర్వహణ శాఖ  పేర్కొంది.

ఘటనా స్థలానికి రేపు సీఎం జగన్‌
దేవిపట్నం బోటు ​ప్రమాద ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పర్యటిస్తారని మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆళ్ల నాని, కురసాల కన్నబాబు తెలిపారు. ప్రమాద బాధితులను సీఎం పరామర్శించనున్నట్లు పేర్కొన్నారు. కాగా బోటు ప్రమాదంలో గాయపడి, రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి పరామర్శించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ...’ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ప్రమాదం నుంచి ఇప్పటివరకూ 20మంది సురక్షితంగా  బయటపడ్డారు. ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలు లభించాయి. క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం రాజమండ్రి తరలించేందుకు ఏర్పాటు చేశాం. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బోటులో ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టత లేదు. ఓఎన్‌జీసీ హెలికాఫ్టర్‌తో గాలింపు చర్యలు కొనసాగాయి. మృతుల కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం.’  అని మంత్రులు పేర్కొన్నారు.


చదవండి:

శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డారు...

క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ
సురక్షితంగా బయటపడ్డ పర్యాటకుల వివరాలు
మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి

బోటులో ఎక్కువమంది తెలంగాణవారే!

పాపికొండలు విహార యాత్రలో విషాదం!

రాయల్వశిష్టకు అనుమతి లేదు...

బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్సీరియస్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top