‘భారతీయుడినని సగర్వంగా చెప్పుకునేలా చేశాడు’ | BJP Membership Drive In Poduru West Godavari | Sakshi
Sakshi News home page

‘భారతీయుడినని సగర్వంగా చెప్పుకునేలా చేశాడు’

Aug 12 2019 2:00 PM | Updated on Aug 12 2019 3:36 PM

BJP Membership Drive In Poduru West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: ‘జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏను రద్దు చేసి దేశమంతటా ఒకే రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చిన ధీరుడు ప్రధాని నరేంద్ర మోదీ’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం పోడూరు మండలం వేడంగిలో బీజేపీ సభ్యత్వ నమోదులో కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి ఒక్కరు భారతీయుడు అని సగర్వంగా చెప్పుకునే విధంగా మోదీ సుపరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి తామే వాటిని అమలు చేసినట్లు దుష్ప్రచారం చేసిందని టీడీపీని విమర్శించారు. పైగా ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు అందినకాడికి ప్రజలను దోచుకున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement