చంద్రబాబు నివాసం సమీపంలో ఘోర ప్రమాదం

Bike Accident At Near To Chandrababu Home In Amravati - Sakshi

సాక్షి, అమరావతి: ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సీఎం ఇంటి సమీపంలోని కరకట్టపై బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఎదురెదురుగా వేగంగా వస్తున్న వాహనాలు రెండూ బలంగా ఢీకొట్టుకోవడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి ఎగిరి బొలెరోపై పడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బైక్‌పై ఉన్న వ్యక్తి వాహనానికి బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. బొలెరో వాహనంలో ఉన్నవారెవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top