తిరుమలలో 7 అడుగుల నాగుపాము

తిరుమల : లాక్ డౌన్ నేపథ్యంలో తిరుమల గిరుల్లో ధ్వని కాలుష్యం కనుమరుగైంది. నిర్మానుష్యంగా ఉన్న ఘాట్ రోడ్లపై వన్యప్రాణులు దర్శనమిస్తున్నాయి. తిరుమలలో పలు మార్లు చిరుతలు, పాములు, జింకలు స్థానికులు నివాసం ఉంటున్న ప్రాంతాలలో, ఘాట్ రోడ్లలో తరచూ సంచరిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీ నగర్‌లోకి ఏడు అడుగుల నాగుపాము చొరబడింది. నాగు పామును గుర్తించిన ఇంటి సభ్యులు బయటకు పరుగులు తీశారు. టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు స్థానికులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న భాస్కర్ నాయుడు... చాకచక్యంగా నాగుపామును పట్టుకుని అవ్వచారి కోనలో వదిలిపెట్టారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి