అప్లోడ్ కాని 3 వేల మంది దరఖాస్తులు
2015-16 ఆర్థిక సంవత్సరంలో నెరవేరని లక్ష్యం
బ్యాంకర్లు సహకరించినా ఫలితం శూన్యం
కర్నూలు(అర్బన్):జిల్లాలోని బీసీ వర్గాలకు చెందిన రుణాలకు ‘లాక్ ’ పడింది. దీంతో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం నెరవేరని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా 5,940 మందికి రూ.16 కోట్ల మేర రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని 5209 మందికి, మున్సిపల్ ప్రాంతాల్లోని 731 మందికి రుణాలు అందించాల్సి ఉంది. అయితే లబ్ధిదారుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని తాజాగా రూ.5.80 కోట్లకు సవరించారు. సవరించిన లక్ష్యం మేరకు రూ.5.80 కోట్లను 1694 మందికి మాత్రమే సర్దుబాటు చేయనున్నారు. ఈ మేరకు వీరికి మాత్రమే రుణ మంజూరు ఉత్తర్వులను అందించనున్నారు.
దాదాపు 3 వేలకు పైగా లబ్ధిదారులకు రుణాలు మంజూరైనా, సబ్సిడీ కోసం వారి బ్యాంకు ఖాతా నెంబర్లను అప్లోడ్ చేసేందుకు వీలు లేని పరిస్థితి నెలకొనింది. హైదరాబాద్ ఉన్నతాధికారి కార్యాలయంలో అప్లోడ్ చేసేందుకు ఫ్రీజింగ్ విధించిన కారణంగా బ్యాంకు ఖాతా నంబర్లు అప్లోడ్ కావడం లేదు. మూడు వేల మంది దరఖాస్తులు అప్లోడ్ కాకపోవడం, లక్ష్యానికి సంబంధించి 1246 దరఖాస్తులు మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది.
బ్యాంకర్లు సహకరించినా ....
ఈ ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ పలుమార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. ఈ మేరకు బ్యాంకర్లు కూడా తమ సహకారాన్ని అందించి రుణాలు అందించేందుకు అర్హులైన వారికి అంగీకార పత్రాలను కూడా అందించారు. అయినా ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిన కారణంగా సబ్సిడీ రుణాలు అందని పరిస్థితి నెలకొనింది. ఫ్రీజింగ్ తొలగించకుంటే ... ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి పైగా మందికి రుణాలు విడుదల కావు.
బీసీ రుణాలకు ‘లాక్’
Published Sun, Feb 21 2016 3:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement