సమసమాజ స్ఫూర్తిప్రదాత పూలే: బత్తుల | Battula Brahmanandha reddy comments on Pule | Sakshi
Sakshi News home page

సమసమాజ స్ఫూర్తిప్రదాత పూలే: బత్తుల

Apr 12 2018 2:25 AM | Updated on May 29 2018 4:40 PM

Battula Brahmanandha reddy comments on Pule - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  సమసమాజ స్ఫూర్తి ప్రదాత  మహాత్మా జ్యోతిరావు పూలే అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో, విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ...  ఆ రోజుల్లోనే అసమానతలు, అంటరానితనం, మహిళాహక్కుల కోసం  జ్యోతిరావు పూలే పోరాడారని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో పార్టీ  అధికార ప్రతినిధి నారాయణ మూర్తి, నాయకులు చల్లా మధుసూదన్‌ రెడ్డి, కాకమాను రాజశేఖర్, విజయ్‌ చందర్, డాక్టర్‌ ప్రఫుల్లారెడ్డి, కె.శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement