అయ్యో చిన్నారి..  | Balloon Kills One Year Old Kid | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన బెలూన్‌

Apr 15 2018 8:43 AM | Updated on Sep 28 2018 3:39 PM

Balloon Kills One Year Old Kid - Sakshi

సాక్షి, తిరుపతి రూరల్‌ : అప్పటివరకు చేతితో గిలిగింతలు పెట్టిన ఆ బెలూన్‌...పేలిపోయిన తర్వాత అమాయకంగా నోట్లో వేసుకున్న ఆ చిన్నారికి నరకం చూపించింది. గొంతుకు అడ్డం పడిన బెలూన్‌ను మింగలేకకక్కలేక... ఊపిరి తీసుకోలేక అల్లాడిన ఆ చిన్నారి చివరికి మృత్యువుకు తలవొంచింది. ఈ విషాద ఘటన తిరుపతి రూరల్‌ మండలం చెర్లోపల్లి పంచాయతీ రిక్షాకాలనీలో శుక్రవారం జరిగింది. సుదర్శన్, సునీత దంపతలకు హేమవర్షిత(1) ఏకైక కుమార్తె. సుదర్శన్‌ విద్యుత్‌ శాఖలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

శుక్రవారం రాత్రి బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు వీరు వెళ్లారు. పాప అడగడంతో ఇంటికి ఒక బెలూన్‌ను తీసుకొచ్చారు. దానితో ఆడుకున్న వర్షిత అది పేలిపోవడంతో తినే వస్తువు అనుకుంటూ నోట్లో వేసుకుంది. అది కాస్త.. ఆ చిన్నారి గొంతులో అడ్డం పడింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో గుర్తించిన తల్లి దాన్ని బయటకు కక్కించేందుకు తీవ్రంగా శ్రమించారు. పరిస్థితి విషమంగా మారడంతో రుయా చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి  చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement