‘సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి’

Balineni Srinivasa Reddy Said Employees Work With CM Jagan Ambition - Sakshi

సాక్షి, విజయవాడ : విద్యుత్‌ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్‌ శాఖలో సోమవారం 170 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లకు నియామక పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో విఫలమైందని, విద్యుత్‌ శాఖలో చాలా తప్పిదాలకు పాల్పడిందని విమర్శించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం సీఎం జగన్‌ చేస్తున్నారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఎనిమిది వేల జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులను భర్తీ చేశారని ప్రశంసించారు.

170 మందికి సర్టిఫికేట్‌ ఇవ్వడం సంతోషంగా ఉందని, ఉద్యోగులందరూ సంస్థ తమది అనుకోని పనిచేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉద్యోగాల కల్పనలో ముందుంటారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయ సాధనకు అనుగుణంగా ఉద్యోగులు పని చేయాలని పిలుపునిచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top