బాహుబలి హౌస్‌ఫుల్ | Bahubali Housefull | Sakshi
Sakshi News home page

బాహుబలి హౌస్‌ఫుల్

Jul 11 2015 12:51 AM | Updated on Sep 3 2017 5:15 AM

బాహుబలి హౌస్‌ఫుల్

బాహుబలి హౌస్‌ఫుల్

ఇటీవల కాలంలో సినీ అభిమానులు ఎక్కడ చూసినా బహుబలి గురించే చర్చా..

నగరంలో 38 స్క్రీన్స్‌పై 150 షోలకుపైగా ప్రదర్శన  

 లబ్బీపేట : ఇటీవల కాలంలో సినీ అభిమానులు ఎక్కడ చూసినా బహుబలి గురించే చర్చా.. భారీ బడ్జెట్.. రెండున్నరేళ్ల పాటు చిత్రీకరణ, వివాదాలు వంటి వాటితో అందరి దృష్టిలో బాహుబలి చిత్రమే నిలిచింది.  కుర్రకారు, మధ్య వయస్సు, మహిళలు సినిమాను రిలీజ్‌రోజు చూసేందుకు పోటీ పడ్డారు. మల్టీప్లెక్స్‌లు, ఐనాక్స్‌లు, థియేటర్‌ల వద్ద రెండు రోజుల ముందు నుంచే టికెట్‌ల సందడి నెలకొంది.

శుక్రవారం ఎక్కడ చూసినా బహుబలి సందడే..హీరో ప్రభాస్ పోస్టర్‌కు పలువురు క్షీరాభిషేకం నిర్వహించారు. నగరంలో తొలిరోజు 35 స్క్రీన్స్‌పై బెనిఫిట్ షోలతో కలిసి 150కి పైగా షోలు ప్రద ర్శించారు. దాదాపుగా అన్ని థియేటర్‌లలో ముందే టిక్కెట్‌లు ఇచ్చేయడంతో శుక్రవారం ఎక్కడా తోపులాటలు జరగలేదు. ఐనాక్స్, మల్టీప్లెక్స్‌లలో ఆన్‌లైన్ బుకింగ్స్ ఉండటంతో బుధవారం వరకూ హౌస్‌ఫుల్ అయిపోయాయి.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement