బాబు భజన బృందం కిమ్మనడం లేదెందుకో? | Babu team is beeing silent why? | Sakshi
Sakshi News home page

బాబు భజన బృందం కిమ్మనడం లేదెందుకో?

Dec 27 2015 3:23 AM | Updated on Aug 14 2018 11:24 AM

బాబు భజన బృందం కిమ్మనడం లేదెందుకో? - Sakshi

బాబు భజన బృందం కిమ్మనడం లేదెందుకో?

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ఈగ వాలనివ్వని భజన బృందం ఈ మధ్య కొన్ని అంశాల్లో కిమ్మనడం లేదట.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ఈగ వాలనివ్వని భజన బృందం ఈ మధ్య కొన్ని అంశాల్లో కిమ్మనడం లేదట. ముఖ్యంగా ఎవరైనా చంద్రబాబును సునిశితంగా విమర్శించినా తట్టుకోలేక ఒంటికాలిపై లేచే అమాత్యులు కొందరు తమ నోటికి పని చెప్పడం లేదు. చంద్రబాబుపై ఏదైనా విమర్శ వచ్చినప్పుడు ప్రెస్‌మీట్ల మీద ప్రెస్‌మీట్లు పెట్టి తమ స్వామి భక్తి చాటుకునే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటీవల బాబు డాక్టరేట్ గుట్టురట్టైనా, సోషల్ మీడియాలో షికాగో స్టేట్ యూనివర్శిటీ డాక్టరేట్ అంశం హల్‌చల్ చేసినా నోరు మెదపకపోవడంపై ఏమై ఉంటుందబ్బా.. అని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయట.

ప్రచారానికి, ఎదురుదాడికి బ్రాండ్ అంబాసిడర్లుగా ముద్రపడిన బాబు అండ్ కో మౌనముద్ర దాల్చడంపైనా రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ఆ మధ్య చినబాబు, అమెరికా అధ్యక్షుడు ఒబామా అపాయింట్‌మెంట్‌పైనా పెద్ద చర్చ నడిచింది. ఒబామా అపాయింట్‌మెంట్ చినబాబుకు ఎలా దక్కిందో.. అటు సోషల్ మీడియాతో పాటు ఇటు పత్రికల్లోనూ విసృ్తత ప్రచారం నడిచింది. ఆ సమయంలోనూ తమ్ముళ్లు ఎక్కడా నోరు పారేసుకోలేదు. అంటే మౌనం అర్ధాంగీకారమే కదా.. అని పలువురు చెవులు కొరుక్కుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement