విశాఖను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తాం

Avanthi Srinivas Comments About Development Of Industries In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : లాక్‌డౌన్‌ నుంచి పారిశ్రామికవేత్తలు కోలుకునే పరిస్థితి తిరిగి వస్తుందంటూ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. విశాఖను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారన్నారు. ఈ ఏడాదిలో 39 కొత్త పరిశ్రమల ద్వారా 30 వేల మందికి ఉపాధి లభించిందన్నారు. రాష్ట్రంలో ఐదు భారీ పరిశ్రమల ఏర్పాటుతో కొత్తగా రూ. 600 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ సీఎం జగన్‌ పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోని రాచపల్లి, గుర్రంపాలెం వద్ద ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రతీ పార్లమెంటు పరిధిలో స్కిల్‌డెవలప్‌మెంట్ కాలేజీలు ఏర్పాటుతో పాటు విశాఖలో స్కిల్‌ డెవలప్‌మెంట్ వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారంటూ మంత్రి తెలిపారు. చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ముంజూరు చేయడంలో ఎప్పుడూ ముందుంటదని తెలిపారు. వలస వెళ్ళిన కార్మికులు తిరిగి పరిశ్రమల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని అవంతి వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top