శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా | Assembly session postponed | Sakshi
Sakshi News home page

శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా

Dec 12 2013 11:31 AM | Updated on Sep 2 2017 1:32 AM

శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా

శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా

శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా వేశారు.

హైదరాబాద్: శాసనసభ శీతాకాల  సమావేశాలు రేపటికి వాయిదా వేశారు. సమావేశాలు సమైక్యాంధ్ర నినాదాలతో ప్రారంభమయ్యాయి.  సమైక్య రాష్ట్ర తీర్మానం కోసం వైఎస్ఆర్ సిపి సభ్యులు డిమాండ్ చేశారు. సభలో సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి  నినాదాలు చేశారు.

సంతాప తీర్మానాలకు సహకరించాలని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, టిఆర్ఎస్ నేత కెటిఆర్, ఇతర పార్టీల నేతలు  జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్కు నివాళులర్పించారు. ఆ తరువాత స్పీకర్ శాసనసభను రేపటికి వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement