ప్రాంతాలవారీగా విడిపోయిన సభ్యులు చేసిన తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో బుధవారం శాసనసభ హోరెత్తిపోరుుంది.
బిల్లుపై ఓటింగ్‌కు వైఎస్సార్‌సీపీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రాంతాలవారీగా విడిపోయిన సభ్యులు చేసిన తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో బుధవారం శాసనసభ హోరెత్తిపోరుుంది. ఇరు ప్రాంతాల సభ్యులు ఒకేసారి పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తుండటంతో ఎలాంటి చర్చకు అవకాశం చిక్కలేదు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సభ వారుుదాల అనంతరం మధ్యాహ్నం రెండున్నర సమయంలో గురువారానికి వాయిదా పడింది. ఈ మధ్యలో కేవలం 9 నిమిషాల పాటు సభ కొనసాగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే టీ బిల్లుపై వెంటనే ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లారు. ‘వుయ్ వాంట్ ఓటింగ్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ సభ్యులతోపాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా పోడియంను చుట్టుముట్టారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు.
మరోవైపు టీడీపీ సీమాంధ్ర నేతలు ప్లకార్డులు పట్టుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ చర్చలో పాల్గొనటం ద్వారా మనోభావాలను వెల్లడించాలని పదేపదే సూచించినా ఫలితం లేకుండా పోరుుంది. దీంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి 11.24కు సభ ప్రారంభం కాగానే అదే పరిస్థితి పునరావృతం కావటంతో కేవలం నిమిషానికే మళ్లీ వాయిదా పడింది. మళ్లీ రెండున్నరకు ప్రారంభమైనా పోడియం వద్ద నినాదాలు కొనసాగడంతో సుమారు 3 నిమిషాల తర్వాత సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. శాసనమండలి కూడా బుధవారం వాయిదాల పర్వంగానే ముగిసింది.