వైఎస్సార్‌సీపీలోకి ఆర్యవైశ్యుల చేరిక | Arya Vyshyaas Into Ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి ఆర్యవైశ్యుల చేరిక

Apr 10 2019 11:05 AM | Updated on Apr 10 2019 11:07 AM

Arya Vyshyaas Into Ysrcp - Sakshi

వైఎస్సార్‌ సీపీలో చేరిన ఆర్యవైశ్య సంఘ నాయకులతో వైఎస్సార్‌ సీపీ నేతలు పెండ్యాల కృష్ణబాబు, కోడూరి శివరామకృష్ణ 

సాక్షి, కొవ్వూరు: రానున్న ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని ఆ పార్టీ సీజీసీ సభ్యులు పెండ్యాల కృష్ణబాబు కోరారు. పట్టణంలో సాయిలక్ష్మి రెసిడెన్సిలో మంగళవారం నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి వచ్చిన మహిళకు టీడీపీ వారు టిక్కెట్టు ఇస్తే, ఇక్కడ స్థానికురాలైన తానేటి వనిత వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారన్నారు. వివాద రహితురాలిగా ఉండే వనితను  గెలిపించుకుంటే రానున్న రోజుల్లో అందరికీ మేలు చేస్తారని చెప్పారు. అలాగే ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌ని గెలిపించాలని కోరారు. తాను ఎప్పటికీ మీ మనిషిగానే అందుబాటులో ఉంటానని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ, వాసవీక్లబ్‌ అధ్యక్షురాలు ఉప్పల శ్రీవల్లి, వాసవీక్లబ్‌ జోన్‌ చైర్మన్‌ కాశీ అన్నపూర్ణ మాట్లాడుతూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వైఎస్సార్‌ సీపీకి ఆర్యవైశ్యులంతా అండగా ఉంటామని ఆ సంఘం నాయకులు మద్దతు పలికారు.

పార్టీ నాయకుడు వాసవీక్లబ్‌ ఇంటర్‌ నేషనల్‌ ప్రోగాం కో–ఆర్డినేటర్‌ వలివేటి ప్రసాద్, కాకి అనిల్‌ సూర్య సారథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో  వాసవీక్లబ్‌ అధ్యక్షుడు ఉప్పల రవికుమార్, ఆర్యవైశ్య సంఘ నాయకులు మన్యం ఈశ్వర్, చక్కా సూర్య గౌతమ్, గ్రంధి గౌతమ్, దేవతు కృష్ణప్రసాద్, రాఘవ రమాకాంత్, నాగవరపు హనుమంతు, పీఎల్‌ రామ్‌కుమార్, తీగెల రవికుమార్, ముత్తా రామారావు, సత్యవరపు గురున్నాధం, జల్లూరి శ్రీకాంత్, అద్ధెపల్లి మూర్తితో పాటు మాజీ కౌన్సిలర్‌ బాలదారి బాబ్జీ వైఎస్సార్‌ సీపీలో చేరారు.కృష్ణబాబు, శివరామకృష్ణలు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కొల్లేపర శ్రీనివాస్, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement