జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చే సేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను
ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ఏర్పాట్లు
Nov 7 2013 4:23 AM | Updated on Sep 2 2017 12:20 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చే సేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను రూపకల్పన చేయడంతో పాటు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరినీ ఓటర్లు గా చేర్చాలన్న ఆదేశాలతో అధికారులు సన్నద్ధమయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు చేపడుతున్నారు.ప్రధానంగా ఓటరు చేర్పుకు అవసరమైన ఫారం- 6, చనిపోయిన వారి పేరు తొలగించేందుకు ఫారం-7, చిరునామా, తప్పులు సవరించడానికి ఫారం- 8తో పాటూ పోలింగ్ స్టేషన్ మార్పు కోసం ‘ఫారం -8ఎ’లను కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లో అందుబాటులో ఉంచారు. వీటిని నియోజక వర్గాల వారీగా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ చిన్నారావు ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. బుధవారం చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాలకు సంబంధించిన దరఖాస్తులను తరలించారు.
Advertisement
Advertisement