రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ | army recruitment rally in tirupati tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Aug 16 2015 7:43 PM | Updated on Sep 3 2017 7:33 AM

ధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు సంబంధించి సోమవారం నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు గుంటూరు రేంజ్ కల్నల్ దురవ్ చౌదరి తెలిపారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు సంబంధించి సోమవారం నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు గుంటూరు రేంజ్ కల్నల్ దురవ్ చౌదరి తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ర్యాలీకి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి 1,600 ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్టు తెలిపారు.


రిక్రూట్‌మెంట్ ర్యాలీలో 30 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన, దేహ దారుఢ్యం, వైద్య పరీక్షలు నిర్ణయించిన తేదీల్లోనే జరుగుతాయన్నారు. వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్‌లో రాత పరీక్ష ఉంటుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement