అదే తీరు.. 9తోనే సరి

Arguments Between TDPAnd YSRCP In Chitoor - Sakshi

టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు

నిధుల విడుదల వివక్షపై టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలి నిరసన

సాక్షరభారత్‌ రద్దుపై వాదోపవాదాలు

వాడివేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం 

సాక్షి, చిత్తూరుఎడ్యుకేషన్‌ : ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకొకసారి జరిగే జెడ్పీ సర్వ సభ్య సమావేశం నిర్వహణలో తీరు మారలేదు. ఎప్పటి లాగే ప్రధాన అంశాలు చర్చకు రాలేదు. శనివారం స్థానిక అంబేడ్కర్‌ భవనంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ గీర్వాణి అధ్యక్షతన జరిగిన జిల్లా పరి షత్‌ సర్వసభ్య సమావేశంలో చిన్న చిన్న సమస్యలపైనే చర్చించి, మమ అనిపించారు.  సమావేశానికి పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి హాజరయ్యారు. ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూ డా సమావేశానికి కాకపోవడం గమనార్హం. ఇక జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మాత్రం సమావేశానికి యథావిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జేసీ గిరీషా, జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, ఏఓలు ప్రభాకర్‌రెడ్డి, వెంకటరత్నం, అధికారులు పాండురంగస్వామి, విజయకుమార్, రవిప్రకాష్‌రెడ్డి, కుర్మానాథ్, ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, దొరబాబు, జిల్లా గ్రంథా లయ చైర్మన్‌ కన్నయ్యనాయుడు  పాల్గొన్నారు. 

 టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలి బైఠాయింపు
జెడ్పీ పాలకవర్గం తమకు అనుకూలంగా ఉన్న వారికే నిధులు కేటాయిస్తోందని నాగలాపురం టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత సమావేశంలో స్టేజీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను బీసీ మహిళనని తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, తదితర పనులను తమ మండలానికి కేటాయించడం లేదని తెలిపారు.  

తొమ్మిదింటితో సరిపెట్టేశారు
జెడ్పీ సమావేశం ఉదయం 11.10 గం టలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల కాంట్రాక్టులకు సంబంధించిన జీఎస్టీపై 45 నిమిషాలు గడిపేశారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు దేశాయ్‌ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌ గళం విప్పారు. అజెండాలో 42 అంశాలు ఉండగా కేవలం 9 అం శాలపై మాత్రమే చర్చలు జరిపి తూతూ మం త్రంగా సభను ముగించేశారు. 

సాక్షరభారత్‌ రద్దుపై వాడివేడి చర్చ
రాష్ట్ర ప్రభుత్వం సాక్షరభారత్‌పై కుట్రపన్ని ఆ కార్యక్రమాన్ని రద్దు చేసిందని పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్‌ ఆరోపించారు. దీనిపై మంత్రి అమరనాథరెడ్డి జోక్యం చేసుకుని ఆ నిర్ణయం తమది కాదని కేంద్రప్రభుత్వం రద్దు చేసిందని సమాధానమిచ్చారు. ఏ ఇతర రాష్ట్రాల్లో లేని రద్దు రాష్ట్రంలో మాత్రమే ఎందుకు విధించారని సభ్యులు ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా ఇక్కడ మాట్లాడితే ఏం లాభముంటుందని మంత్రి అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి మాట్లాడుతూ ‘నువ్వు వైఎస్సార్‌ సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీ మారావు. నీవు మాకు నీతులు చెప్పడం ఏమిటి?.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైఎస్సార్‌ సీపీ, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల మధ్యవాదోపవాదాలు జరిగాయి. 

విద్యాశాఖపై సుదీర్ఘచర్చ
అజెండాలో రెండో అంశమైన విద్యాశాఖపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నభోజన నిధులు విడుదల కావడం లేదని, విద్యాసంవత్సరం ప్రారంభమైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ అందించలేకపోయారన్నారు. ప్రభుత్వ సొమ్మును ఖర్చుపెట్టి ఇషా విద్యను నడపడం సబబు కాదన్నారు. రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జెడ్పీ పాఠశాల స్థలాలను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ మా ట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకనే దాన్ని టీడీపీ నాయకుల ఘనతగా పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలనడం సరైన పద్ధతి కాదన్నారు. 

రైతులకు జిప్సం అందడంలేదు
ఐరాల, పూతలపట్టు ప్రాంతాల్లో చాలా మంది రైతులకు జిప్సం అందడం లేదు. జిల్లా పరిషత్‌ సమావేశంలో ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరం. ప్రజా సమస్యలపై వారు చర్చించరు... మేము చర్చిస్తే విరుద్ధంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయే గాని బోధించేందుకు టీచర్లు లేకపోవడం దారుణం.    – సునీల్‌కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే 

మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లు జరపడం లేదు
మోడల్‌ స్కూళ్లల్లో పేద విద్యార్థులు చేరడానికి వెళుతుంటే అడ్మిషన్లు లేవని ప్రిన్సిపాళ్లు తిప్పి పంపుతున్నారు. 20 శాతం అధికంగా విద్యార్థులను చేర్చుకోవచ్చనన్న నిబంధన ఉన్నప్పటికీ అడ్మిషన్లు చేయడం లేదు. ఈ విషయంపై డీఈఓ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉండడంతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది.    – దేశాయ్‌ తిప్పారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే 

ఫలితం దక్కడం లేదు
ప్రతిసారీ సర్వసభ్య సమావేశానికి, స్థాయి సంఘ సమావేశాలకు హాజరవుతూనే ఉన్నాం. జెడ్పీకి ఎన్ని నిధులు వచ్చా యి... ఏఏ పనులకు ఖర్చు పె ట్టారు... అన్న వివరాలను చెప్పడం లేదు.  పాఠశాలలో అదనపు తరగతులు అవసరమున్న చోట కట్టకుండా ప్రభుత్వ నిధులను వృథా చేస్తున్నారు. సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చిస్తున్నా ఫలితం దక్కడం లేదు.         – వెంకటరెడ్డి యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు, పుంగనూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top