పొలం పనుల్లో అరకు ఎంపీ మాధవి | Sakshi
Sakshi News home page

పొలం పనుల్లో అరకు ఎంపీ మాధవి

Published Wed, Jun 24 2020 9:00 AM

Araku MP oddeti Madhavi busy in sowing seeds In Field - Sakshi

సాక్షి, అరకు : పార్లమెంటు సభ్యురాలు అయినప్పటికీ తమ కుటుంబ జీవనాధారమైన వ్యవసాయ పనుల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పాల్గొన్నారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే గుడి దేవుడు ద్వారా సంక్రమించిన పొలంలో మంగళవారం దుక్కి దున్ని విత్తనాలు జల్లి పనులు చేపట్టారు.  తన స్వగ్రామం శరభన్నపాలెం నుంచి నిమ్మగడ్డ వెళ్లే మార్గంలో ఉన్న పరిమిత వ్యవసాయ భూమిలో పొలం పని చేశారు. తొలి దశ నుంచి తన తండ్రి ద్వారా వ్యవసాయ పనులు చేస్తూ సామాజిక కార్యక్రమాలు పాల్గొనడం అలవాటు అని ఎంపీ మాధవి పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement