భార్య, కొడుకులు, కుమార్తెలు కలసి చంపేశారు | ar head constable ayum killed by family members, says police | Sakshi
Sakshi News home page

భార్య, కొడుకులు, కుమార్తెలు కలసి చంపేశారు

Apr 13 2017 7:52 PM | Updated on Apr 8 2019 8:33 PM

భార్య, కొడుకులు, కుమార్తెలు కలసి చంపేశారు - Sakshi

భార్య, కొడుకులు, కుమార్తెలు కలసి చంపేశారు

విజయవాడలో సంచలనం కలిగించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆయూబ్ హత్యకేసు మిస్టరీ వీడిండి.

విజయవాడ: విజయవాడలో సంచలనం కలిగించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆయూబ్ హత్యకేసు మిస్టరీ వీడిండి. ఈ కేసులో పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. హెడ్ కానిస్టేబుల్‌ను పోలీస్ క్వార్టర్స్‌ లోనే అతని భార్య, కుమార్తెలు, కుమారులు కలిసి క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.

హత్య అనంతరం ఆయూబ్ కారులోనే అతని మృతదేహాన్ని తీసుకెళ్లి జక్కంపూడి వద్ద పడేశారని డీసీపీ పాలరాజు తెలిపారు. మృతదేహం వద్దనే ఆయూబ్ వాహనాన్ని కూడా పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని చెప్పారు. దీనిపై మృతుడి సోదరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఆయూబ్ భార్య జకీరున్నీసా, కుమార్తెలు నీలోఫర్, నాజియా, కుమారులు సద్దాం, ఇమ్రాన్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement