family members killed
-
Operation Sindoor: అజార్ కుటుంబసభ్యులు హతం
లాహోర్: పాకిస్తాన్‌లోని బహావల్పూర్ నగరంలో భారత్ జరిపిన దాడుల్లో ఉగ్రసంస్థ జైషే మొహహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబంలో పది మంది హతమయ్యారు. ఈ వివరాలను స్వయంగా ఆయనే పాకిస్తాన్ మీడియాకు వెల్లడించినట్లు సంబంధిత ప్రకటన పేర్కొంది. బహావల్పూర్లోని జామియా మసీద్ సుభాన్ అల్లాహ్ శిబిరం సముదాయంపై భారత్ జరిపిన క్షిపణి దాడిలో అజార్ సోదరి, ఆమె భర్త, అజార్ మేనల్లుడు, అతని భార్య, మరో మేనల్లుడు, ఉమ్మడి కుటుంబంలోని ఐదుగురు చిన్నారులు చనిపోయారు. వీరితోపాటే అజార్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అతని తల్లి, మరో ఇద్దరు వ్యక్తులూ మరణించారు. ఈ దాడిలో గాయపడిన వారిని దగ్గర్లోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. 1999లో ఐసీ–814 విమానాన్ని హైజాక్ చేశాక దానిని విడిచిపెట్టాలంటే అజార్‌ను వదిలేయాలని హైజాకర్లు డిమాండ్‌చేయడం, తప్పని పరిస్థితుల్లో అజార్‌ను జైలు నుంచి వదిలేయడం తెల్సిందే. విడుదలైన నాటి నుంచి అజార్ పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలను ఉధృతం చేశాడు. సుభాన్ శిబిరం అలియాస్ ఉస్మానో అలీ క్యాంపస్‌గా పిలుచుకునే ఈ ప్రాంగణాన్ని జైషే ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయంగా అజార్ వినియోగించుకుంటున్నాడు. 18 ఎకరాల ఈ ప్రాంతం నుంచే జైషే ఉగ్రసంస్థలోకి కొత్త వాళ్ల రిక్రూట్మెంట్లు, విద్వేష బోధన, శిక్షణ, నిధుల సేకరణ తదితర కార్యకలాపాలు కొనసా గుతుంటాయి. 2019 మేలో అజార్‌ను ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2019 ఏప్రిల్ తర్వాత అజార్ పెద్దగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. బహావల్పూర్లోనే ఉంటున్నట్లు గతంలోనే నిఘా సమాచారం భారత్‌కు అందింది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2000లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడులకు అజార్ సూత్రధారి అని తెలుస్తోంది. -
Israel-Hamas war: కుటుంబాన్ని కూల్చేశారు
రఫా(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడికి ప్రతీకారంగా మెల్లగా దాడులు మొదలెట్టిన ఇజ్రాయెల్ రోజురోజుకూ రెచి్చపోతోంది. అ మాయక పాలస్తీనియన్లను పొట్టనబెట్టుకుంటోంది. శనివారం ఇజ్రాయెల్ సేనల నిర్దయ దాడులకు ఒక ఉమ్మడి కుటుంబం నిట్టనిలువునా కుప్పకూలింది. గాజా సిటీలో జరిపిన దాడుల్లో ఐక్యరాజ్యసమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఉద్యోగి ‘అల్–మగ్రాబీ’ ఉమ్మడి కుటుంబంలో ఏకంగా 76 మంది కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారు. నుసేరాత్ పట్టణ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలో స్థానిక టీవీ పాత్రికేయుడు మొహమ్మద్ ఖలీఫా ఉమ్మడి కుటుంబం బలైంది. ఈ దాడిలో 14 మంది కుటుంబసభ్యులు మరణించారు. మొత్తం దాడుల్లో 90 మందికిపైగా మరణించారని గాజా పౌరరక్షణ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. -
నాకు దిక్కేది.. ఎలా బతకాలి
తూర్పు గోదావరి (రావులపాలెం) : నాన్న కోసం వెళ్లిన అమ్మ, అన్నయ్య, నాన్నమ్మ లేకుండా పోయారు. ఇక ఎలా బతకాలి.. నాకు దిక్కేది అంటూ ఆ కుటుంబంలో చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ గుండెలు అవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. కొత్తపేట మండలం మందపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి పాలవ్యాన్, మోటారు బైక్‌ను ఢీ కొట్టిన ఘటనలో రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడ్డారు. పోస్టుమార్టం అనంతరం అప్పన సత్యవతి, వెంకటలక్ష్మి, మహేష్ మృతదేహాలను సమీప బంధువులు, స్థానికులు రెండు అంబులెన్సుల్లో ఇంటికి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు, బంధువులు చివరి చూపుకోసం రావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన దుర్గాప్రసాద్ నాన్నమ్మ సత్యవతి భర్త రెండేళ్ల క్రితం కాలం చేశాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారందరికీ వివాహం అయ్యింది. సత్యవతి భర్త పోయిన నాటి నుంచి పెద్ద కుమారుడు పుల్లేశ్వరరావు, చిన్న కుమారుడు నాగేశ్వరరావుల వద్ద ఉంటుంది. అయితే చిన్న కుమారుడు నాగేశ్వరరావు కొబ్బరి లోడింగ్ కూలీ పని చేసుకుంటూ భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు మహేష్, దుర్గాప్రసాద్‌ను చదివిస్తున్నాడు. మహేష్ డిగ్రీ చదువుతుండగా దుర్గాప్రసాద్ ఇంటర్ పూర్తి చేశాడు. కొంతకాలంగా వేరే మహిళతో నాగేశ్వరరావు సహజీవనం చేస్తున్నాడు. దీంతో ఆ కుటుబంలో కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే గురువారం ఉదయం కొబ్బరి లోడింగ్ పనికి వెళ్లిన నాగేశ్వరరావు సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశారు. ఎంతకీ స్పందించకపోవడంతో ఆందోళన చెందారు. చివరకు నాగేశ్వరరావు కొత్తపేటలో ఉన్నట్టు తెలుసుకుని అతని తల్లి సత్యవతి, భార్య వెంకటలక్ష్మి, పెద్ద కుమారుడు మహేష్ అతని వద్దకు వెళ్ళి మాట్లాడారు. అనంతరం తిరిగి వస్తుంటే ప్రమాదానికి గురయ్యారు. డిగ్రీ చదువుతున్న మహేష్ కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్నామని సమీప బంధువులు అప్పన రామకృష్ణ, సత్యకిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
భార్య, కొడుకులు, కుమార్తెలు కలసి చంపేశారు
విజయవాడ: విజయవాడలో సంచలనం కలిగించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆయూబ్ హత్యకేసు మిస్టరీ వీడిండి. ఈ కేసులో పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. హెడ్ కానిస్టేబుల్‌ను పోలీస్ క్వార్టర్స్ లోనే అతని భార్య, కుమార్తెలు, కుమారులు కలిసి క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య అనంతరం ఆయూబ్ కారులోనే అతని మృతదేహాన్ని తీసుకెళ్లి జక్కంపూడి వద్ద పడేశారని డీసీపీ పాలరాజు తెలిపారు. మృతదేహం వద్దనే ఆయూబ్ వాహనాన్ని కూడా పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని చెప్పారు. దీనిపై మృతుడి సోదరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఆయూబ్ భార్య జకీరున్నీసా, కుమార్తెలు నీలోఫర్, నాజియా, కుమారులు సద్దాం, ఇమ్రాన్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు.