రేపట్నుంచి ఆర్టీసీ సర్వీసులు | APSRTC Bus services from 21st May | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి ఆర్టీసీ సర్వీసులు

May 20 2020 4:38 AM | Updated on May 20 2020 8:40 AM

APSRTC Bus services from 21st May - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను ఈనెల 21వతేదీ నుంచి పునఃప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయని చెప్పారు. కరోనా నియంత్రణ నిబంధనలను అనుసరించి భౌతిక దూరం ఉండేలా బస్సు సీట్లలో మార్పులు చేశామన్నారు. 

మధ్యలో ఎక్కడా ఆగవు...
► జిల్లాలు, డిపోల మధ్య మాత్రమే ఆర్టీసీ సర్వీసులు నిర్వహిస్తారు. మధ్యలో ఎక్కడా బస్సులు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోరు. ప్రయాణికులు మాస్క్‌లు ధరించాలి.
► టికెట్లు ఆన్‌లైన్‌లోనే రిజర్వేషన్‌ చేసుకోవాలి. కరెంట్‌ బుకింగ్‌ టికెట్లు కూడా ఆన్‌లైన్‌లోనే రిజర్వేషన్‌ చేసుకోవాలి. టికెట్‌లు చూపించటం, మొబైల్‌ మెస్సేజ్‌లు చూపించటం లాంటివి ఉండవు. 
► కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వృద్ధులు, 10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసర పనులు, వైద్య సేవల కోసం మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement