
సాక్షి,అమరావతి: మహిళలను చంద్రబాబు ప్రభుత్వం చీట్ చేసింది. ఐదు రకాల బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం చేసేలా స్త్రీ శక్తి పథకం అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రమంతటా ఫ్రీ అని కొర్రీలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో స్కీం ఎగట్టొంది.
నాన్‌స్టాప్,సప్తగిరి ఎక్స్‌ప్రెస్,డీలక్స్.. అల్ట్రా డీలక్స్,సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్,ఇంద్ర, వెన్నెల, అమరావతి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎగనామం పెట్టారు. ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరి, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే స్త్రీ శక్తి పథకం అమలుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో హైలెట్ చేసింది.