ఏప్రిల్‌ 7 నుంచి గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షలు | APPSC Announced Revised Schedule For Group 1 Mains Exam | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 7 నుంచి గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షలు

Jan 24 2020 8:07 AM | Updated on Jan 24 2020 8:10 AM

APPSC Announced Revised Schedule For Group 1 Mains Exam - Sakshi

సాక్షి, అమరావతి : గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షలు ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి 19 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు గురువారం రివైజ్డ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పలువురు అభ్యర్థుల నుంచి పరీక్షలు వాయిదా వేయాలని విన్నపాలు అందడంతో కమిషన్‌ ఇటీవల పరీక్షల్ని వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.  తేదీల వారీగా, పేపర్ల వారీగా 
ఆయా పరీక్షల రివజ్డ్‌ షెడ్యూల్‌ ఇలా...
ఏప్రిల్‌ 7  :  తెలుగుపేపర్‌ (క్వాలిఫయింగ్‌ నేచర్‌)
ఏప్రిల్‌ 8  :  ఇంగ్లిష్‌ పేపర్‌ (క్వాలిఫయింగ్‌ నేచర్‌)
ఏప్రిల్‌ 11 :   పేపర్‌1
ఏప్రిల్‌ 13  :  పేపర్‌2
ఏప్రిల్‌ 15  :  పేపర్‌3
ఏప్రిల్‌ 17  :  పేపర్‌4
ఏప్రిల్‌ 19  :  పేపర్‌5

వీటితో పాటు గెజిటెడ్‌ పోస్టులకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. 
మే 10, 11 :   అసిస్టెంట్‌ బీసీ, సోషల్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌
మే 11  :   మైనింగ్‌ రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌
మే 12  :  సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఆటోమొబైల్‌ ,ఇంజనీరింగ్‌ పీటీవో, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్, అసిస్టెంట్‌ కెమిస్ట్‌ ఏపీ గ్రౌండ్‌ వాటర్, టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌  

Advertisement
 
Advertisement
Advertisement