బదిలీ జీవోలపై ఏపీ ఉద్యోగ సంఘాలు అసంతృప్తి | APNGO's Met Chandrababu Naidu on Transfer GO | Sakshi
Sakshi News home page

బదిలీ జీవోలపై ఏపీ ఉద్యోగ సంఘాలు అసంతృప్తి

Aug 20 2014 7:19 PM | Updated on Aug 18 2018 8:05 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులను బదిలీ చేస్తూ జారీ చేసిన జీవోపై ఏపీ ఎన్జీఓలు అసంతృప్తిని వ్యక్తం చేశారు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులను బదిలీ చేస్తూ జారీ చేసిన జీవోపై ఏపీ ఎన్జీఓలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కలిసి తమ అసంతృప్తిని ఉద్యోగ సంఘాలు వెళ్లగక్కాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెంటనే మార్పులు చేయాలని చంద్రబాబుకు ఏపీ ఎన్జీఓలు సూచించారు. 
 
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఎగ్జిక్యూటివ్‌, నాన్ ఎగ్జిక్యూటివ్ అంటూ విడదీయడం, విభజించడం బాధాకరమని ఏపీఎన్జీవోలు అన్నారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని మార్పులు చేయాలని ముఖ్యమంత్రికి ఏపీఎన్జీవోలు సూచించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement