కలాంకు ఏపీ పీసీసీ ఘన నివాళి | ap pcc pays tribute to abdul kalam | Sakshi
Sakshi News home page

కలాంకు ఏపీ పీసీసీ ఘన నివాళి

Jul 28 2015 8:13 PM | Updated on Aug 20 2018 3:02 PM

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నేతలు కొనియాడారు.

సాక్షి, హైదరాబాద్‌: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ తులసిరెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డి తదితరులు మంగళవారం ఇందిర భవనలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చేసిన సేవలను, వ్యక్తిత్వాన్ని స్మరించుకుంటూ దేశ చరిత్రలో ఆయన పేరు సుస్థిరంగా నిలుస్తుందన్నారు. హైదరబాద్‌తో ఆయనకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement