హత్యాయత్నం కేసు: కౌంటర్‌ దాఖలు చేసిన ఎన్‌ఐఏ

AP High Court Adjourns for Murder Attempt on YS Jagan Case - Sakshi

తమ వాదనలకు గడువు కోరిన ఏపీ ప్రభుత్వం

విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా

సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటన కేసును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లదంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్ట్‌లో రిట్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. వెంటనే ఎన్‌ఐఏ విచారణపై స్టే విధించాలని ప్రభుత్వం ఈ పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరగ్గా.. తక్షణమే విచారణను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం వాదించింది. గత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్‌పై ఎన్‌ఐఏ అధికారులు కౌంటర్‌ దాఖలు చేయగా.. తమ వాదనను వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం మరింత గడువు కోరింది. దీంతో ఈ కేసు విచారణను కోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.

హైకోర్టులో ఎన్ఐఏ చార్జ్‌షీట్‌ దాఖలు చేసే సమయం దగ్గరపడుతుండటంతో టీడీపీ ప్రభుత్వం ఈ కేసును నిలువరించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎన్ఐఏకు ఇవ్వాలని సిట్‌ అధికారులను హైకోర్టు ఆదేశించినప్పటికీ వారిలో ఎలాంటి చలనం లేదు. హైకోర్టు తుదితీర్పు వచ్చేంతవరకు ఎన్‌ఐఏకు సహకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా ప్రకటించేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top